తూర్పు లడఖ్ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ భల్లా గురువారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ఔన్నత్యం నిరంతరం స్ఫూర్తిదాయకమని లేహ్‌లోని 14 కోర్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.