AP: సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మూలకు అంబులెన్సు సౌకర్యం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో 108 అంబులెన్సు డ్రైవర్లు, సిబ్బందికి తీపి కబురు అందించారు. 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.