7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏళ్ళ బాలిక

85చూసినవారు
7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏళ్ళ బాలిక
ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది. ఏడు పర్వతాలను అధిరోహించే సవాల్‌ను స్వీకరించిన కామ్య మౌంట్‌ కిలిమంజారో(ఆఫ్రికా), మౌంట్‌ ఎల్‌బ్రస్‌, మౌంట్‌ కాజీయాస్కో, మౌంట్‌ అకాన్‌కాగువా, మౌంట్‌ డెనలి, మౌంట్‌ ఎవరెస్ట్‌, మౌంట్‌ విన్సన్‌లను విజయవంతంగా అధిరోహించింది.

సంబంధిత పోస్ట్