AP: రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని బ్లూ ఫాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్‌కు శనివారం అందించారు. రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖలోని రుషికొండకు పేరుంది. అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు గతంలో తాత్కాలికంగా రద్దయింది. బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా 2020లో ధ్రువీకరించారు.