రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లా సూరత్‌గఢ్ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. CISF వాహనాన్ని రైలు ఢీకొట్టింది. కొంత దూరం ఆ వాహనాన్ని రైలు ఈడ్చుకెళ్లింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద రైలు వస్తుండగానే గేటు దాటేందుకు CISF జవాన్ ప్రయత్నించాడు. అయితే రైలు సమీపంలోకి రావడంతో వాహనం నుంచి కిందికి దూకేశాడు. అదృష్టవశాత్తూ అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.