గుడిసెలు కూల్చుతుంటే పుస్తకాల కోసం బాలిక పరుగు (వీడియో)

57చూసినవారు
యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన హృదయాలను ద్రవింపజేస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు శనివారం కూల్చి వేశారు. ఆ సమయంలో ఓ బాలిక తన పుస్తకాలు గుడిసె లోపల ఉన్నాయని గుర్తు తెచ్చుకుంది. ఓ వైపు అధికారులు తమ గుడిసెలు కూల్చుతుండగా, ఆ బాలిక పరుగుపరుగున వెళ్లి తన పుస్తకాలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్