RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించారు. IPL లో నాలుగు జట్లపై 1,000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలిచారు. కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచులో ఆయన వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు. గతంలో CSK, DC, PBKSపై కోహ్లి 1,000 పరుగులు సాధించారు. కాగా డేవిడ్ వార్నర్ (KKR, PBKS), రోహిత్ శర్మ (KKR, DC), ధవన్ (CSK) మాత్రమే ఇతర జట్లపై వెయ్యి పరుగులు నమోదు చేశారు.