AP: ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డును ఆక్రమించి కూరగాయలు అమ్ముతున్నారని మున్సిపల్ సిబ్బంది ఆక్రమాలను తొలగించింది. ఈ క్రమంలో వ్యాపారస్థులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూరగాయల షాపుల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్ చేశారు.