కదులుతున్న రైలుపై ఓ షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు రైలుపై నిలబడి ప్రమాదకర విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న రైలింజన్ పైకి ఎక్కాడు. అంతటితో ఆగకుండా పైన ఉండే విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఆడుకున్నాడు. దానికి తాడు కట్టి కరెంట్ వైర్లకు తాకకుండా కిందకు లాగడం, కొద్దిసేపటి తర్వాత మళ్లీ వదలడం చేశాడు. ఆ వ్యక్తి ఇలా చేస్తుండగా వెనుక ఉన్న మరో ఇద్దరు వీడియో తీశారు.