AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తవ్వకాలన్నీ ఆపేసినట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ న్యాయవాది తెలిపారు. అటు గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. దీంతో తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.