చంద్రబాబు సభలో భద్రతా వైఫల్యం

61చూసినవారు
చంద్రబాబు సభలో భద్రతా వైఫల్యం
టీడీపీ అధినేత చంద్రబాబు సభలో భద్రత వైఫల్యం కలకలం రేపింది. నిన్న డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకొని ఏకంగా ప్రచార వాహనంపైకి ఎక్కారు. దాంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్