TG: సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సదాశివపేటలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లో ఓ యువకుడు ఐస్‌క్రీంను కొన్నాడు. దానిని తిందామని తెరిచి చూడగా అందులో పురుగులు కనిపించాయి. ఐస్‌క్రీమ్‌లో పురుగులు వచ్చాయని షాపు నిర్వహాకులను ప్రశ్నించగా, సిబ్బంది ఆ యువకుడిపై దాడిచేశారు. దీంతో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.