వైసీపీకి షాక్‌.. మాజీ మంత్రి రాజీనామా

82చూసినవారు
వైసీపీకి షాక్‌.. మాజీ మంత్రి రాజీనామా
AP: వైసీపీకి బిగ్ షాక్ త‌గిలింది. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్