శబరిమలలో ఈ ఏడాదికి సంబంధించిన మండలపూజ, మకరవిళక్కు వార్షిక పూజలు ముగిశాయి. దీంతో ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ సీజన్‌లో శబరిమల అయ్యప్ప స్వామిని 53 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించింది. కాగా, రెండు నెలలపాటు జరిగిన మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15వ తేదీన ఆలయాన్ని తెరిచారు.