మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. భార్యపై అత్యాచారం చేశాడని స్నేహితుడిని నరేష్ అనే వ్యక్తి సుత్తితో కొట్టి చంపాడు. సుకాంత్ (29) అనే వ్యక్తి నరేష్ భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే జరిగిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో తన ఇంట్లో ఓ పార్టీకి నరేష్ తన ఫ్రెండ్‌ను ఆహ్వానించి.. మద్యం తాగిన తర్వాత అతన్ని చంపేశాడు. పోలీసులు నరేష్‌ను అరెస్టు చేశారు.