ఫిజికల్ డిజాబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా ఇండియన్ ఫిజికల్ డిజాబిలిటీ క్రికెట్ టీమ్ నిలిచింది. మంగళవారం శ్రీలంకలో జరిగిన ఫైనల్‌లో 79 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కేవలం 118 పరుగులకే కుప్పకూలింది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియన్ టీమ్‌పై హెడ్ కోచ్ రోహిత్ జలానీ ప్రశంసలు కురిపించాడు.