ఆత్మకూరు మండలం పరిధిలోని అప్పారావుపాళెం గిరిజన కాలనీలో ఆదివారం కడప జిల్లా, ఉడుమువారిపల్లికి చెందిన “ఈగ శ్రీనివాసులు రెడ్డి మొదటి వర్ధంతి” సందర్భంగా ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఈగ పృధ్వీధర్ రెడ్డి, ఈగ ప్రభుధర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యుల సహకారంతో “ఐక్య ఫౌండేషన్” ఆధ్వర్యంలో 130 మంది పైగా అన్నదానం చేశామని తెలిపారు.