సంఘం మండలం ఎంఈఓ జానకిరామ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి నారాయణ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంఈఓ ను ఆపస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భారతమాత చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఎంఈఓ గా మండలంలో జానకిరామ్ విశిష్టత అందించారని కొనియాడారు.