మర్రిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రశంసా పురస్కారాన్ని అందుకున్నారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య చేతుల మీదుగా ఆయన గురువారం పురస్కారాన్ని అందుకున్నారు. సహచర ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.