మన ఇల్లు మన గౌరవం అవగాహన సదస్సులో భాగంగా.. శనివారం పెద్దబ్బిపురం గ్రామ సచివాలయం పరిధిలోని లేఅవుట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, సూపరింటెండింగ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇల్లు మంజూరు కాబడిన లబ్ధిదారులందరికి వెనువెంటనే బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసులు, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.