స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా రాబోవు ఐదు విద్యా సంవత్సరాలలో.. విద్యలో చేపట్టవలసిన సంస్కరణలు అనే అంశంపై అనంతసాగరం మండల స్థాయి పోటీలు అనంతసాగరం జడ్పీ హైస్కూల్ నందు శనివారం జరిగాయి. చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు వక్తృత్వ పోటీలో జ్ఞానేష్, డిబేట్ పోటీలో జ్ఞానేష్, వెంగళరావుల టీం విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైంది. వీరిని హెచ్ఎం సురేష్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు అభినందించారు.