ఆత్మకూరు సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో నెల్లూరు పాలెం సెంటర్ వద్ద గురువారం రాత్రి వాహనాలు తనిఖి చేపట్టారు. కాగా గురువారం ఉదయం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సందర్శించిన సందర్భంగా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు పాలెం, మరిపాడులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు.