కందుకూరు పట్టణంలో మోటర్ బైకులు నడిపే కొందరి విపరీత ధోరణి ఇప్పుడు అంతటా ఒక చర్చనీయాంశంగా మారింది. బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాల్సిన ప్లేట్ మీద ' కందుకూరు ఎమ్మెల్యే గారి తాలుకా..' అంటూ పార్టీ సింబల్స్ తో ఉన్న స్టిక్కర్లు పెట్టుకుని కొందరు యువకులు బలాదూర్ గా తిరగడం ఇటీవల జాస్తి అయింది. ఇలా తిరగడం చట్టరీత్యా నేరం అంటున్న మోటర్ వాహనాల తనిఖీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.