ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన మహేంద్ర (29) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి మహేంద్ర కింద పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.