అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కావలి పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడుతున్నట్లు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఆదివారం కావలిలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన సబ్ సెంటరును శాప్ ఛైర్మన్, కావలి ఎమ్మెల్యే దగుమాటి క్రిష్ణారెడ్డి తో కలిసి సందర్శించారు. మినీ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలను శాప్ ఛైర్మన్ కు ఎమ్మెల్యే వివరించారు.