కావలి పట్టణం మద్దూరు పాడులో నిర్మించిన టిడ్కో ఇళ్లను నీటి ముంపు నుండి కాపాడాలని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అసెంబ్లీ లో కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎపి టిడ్కో ద్వారా మద్దూరుపాడులో 2012 ఇళ్ళు నిర్మాణం జరిగాయని, మొత్తం 1309 ఇళ్లకు రిజిస్ట్రేషన్ లు జరగగా, 324 మంది ప్రస్తుతం నివసిస్తున్నారని తెలిపారు. వర్షాలు పడితే పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని తెలిపారు.