కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలను సోమవారం అడిషనల్ డి ఎం హెచ్ ఓ ఖాదర్ వలీ, డాక్టర్ రామకృష్ణ సందర్శించారు. అనంతరం విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, డయేరియా, టీబీ, లెప్రసీ తదితర వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఏఎన్ఎం రాదా, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.