ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు శాఖలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులు వరించాయి. ఈ అవార్డులను గురువారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకుంటారు. అవార్డు వచ్చిన వారిలో సీఐ హైమారావు, నగర పంచాయతీ కమిషనర్ వెంకటరమణ బాబు, ఏఎస్ఓ గిరిధర్ రావు, వ్యవసాయ అధికారి సురేంద్ర, పశుసంవర్ధక శాఖ సహాయకులు మనోజ్ కుమార్ ఉన్నారు.