గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం

73చూసినవారు
గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం
వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం రాత్రి నెల్లూరుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. నెల్లూరు రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్ గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్