నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్గా ఓ. ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ని కలెక్టర్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణ గారికి పుష్పగుచ్ఛం అందచేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు.