జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.