పారిశుద్ధ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలి: సిపిఎం

58చూసినవారు
నెల్లూరు నగరంలోని 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై సచివాలయ సెక్రటరీ, మేస్త్రీల వేధింపులు ఆపాలని సిపిఎం నాయకులు జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాత్రి 12 గంటల పైన విధులకు రావాలని మహిళా కార్మికులను వేధించడం, విశ్రాంతి లేకుండా పని చేయించడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్