తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు శివారు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలు రాహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కాలువలకు సంబంధించి ఆక్రమణలకు గురి కావడంతో కార్పొరేషన్ అధికారులు వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా ఆక్రమణలను తొలగిస్తున్నారు.