నెల్లూరు నగరంలోని స్థానిక మూడో డివిజన్ ప్రాంతానికి చెందిన యాకుల రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కిరణ్ కుమార్, దాసరి లీలా డివిజన్ జనసేన ఇన్ చార్జ్ బత్తల శ్రీకాంత్ సహకారంతో మంగళవారం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకనుగుణంగా జనసైనికులు చేస్తున్నారన్నారు.