వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నెల్లూరు నగరంలో విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బాల పీరయ్య కళ్యాణమండపం నుంచి మినీ బైపాస్ లోని మిలీనియం స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.