UPI చెల్లింపులపై RBI గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ వ్యాలెట్లలోని డబ్బుతో పేమెంట్స్ చేసే అవకాశం తీసుకొచ్చింది. ఇప్పటివరకు PPI సంస్థకు చెందిన UPI ద్వారానే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉంది. ఈ తాజా నిర్ణయంతో ఫోన్-పే, పేటీఎం సహా పలు వ్యాలెట్లలోని మొత్తాన్ని ఇతర యాప్ లోనూ ఉపయోగించుకోవచ్చు.