రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఆత్మకూరు, రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెవెన్యూ పరిధిలోని పెండింగ్ భూసమస్యలపై నిర్వహిస్తున్న గ్రామసభలు చాలా గ్రామాల్లో పూర్తయ్యాయన్నారు.