సాహిత్యం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలుగు సాహితీ వ్యవస్థాపకురాలు శాంతి కృష్ణ అన్నారు. ఆదివారం నెల్లూరు పొగతోట శంకర మఠంలో జరిగిన నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సందడి అరుణ రాసిన ఆత్మీయ బంధాలు కథ సంపుటి పరిచయ సభ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథలు, నవలలు రావడం తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.