రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రి ఆనంను పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.