నెల్లూరు నగరం కపాడిపాళెంలోని సెయింట్ జోసఫ్ చర్చి క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా బుధవారం జరిగాయి. ఈ వేడుకలను నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చర్చికి వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బాలయేసు సప్ర మహోత్సవంలో పాల్గొన్నారు.