వేదగిరిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
వేదగిరిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి వారి దేవస్థానంలో రెండవ శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అభిషేకం, పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. అమ్మవారి అబిషేకం, పల్లకి సేవ లకు ఉభయ కర్తలుగ దేవరపాలెం వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్