Oct 27, 2024, 00:10 IST/
39 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ సస్పెండ్
Oct 27, 2024, 00:10 IST
తెలంగాణలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఆందోళనలకు తోటి కానిస్టేబుల్స్ ను ఉసిగొల్పారనే ఆరోపణలతో 8 బెటాలియన్ల నుండి 39 మంది కానిస్టేబుల్లపై వేటు వేశారు.