ముత్తుకూరు మండలంలోని పైనంపురం గ్రామపంచాయతీలో ఆదివారం నూతన గ్రామ కమిటీ నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఏకమై కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏకగ్రీవ తీర్మానంతో సమన్వయంగా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలోఆరు మంది గ్రామ పెద్దలు ఉండగా మరో 19 మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు.