ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ నెల 14వ తేదీన సాగునీటి సంఘ ఎన్నికలను నిర్వహిస్తామని మనుబోలు తహశీల్దార్ సుబ్బయ్య తెలిపారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల వివరాలను ఆయన వెల్లడించారు. మండలంలో 15 సాగునీటి సంఘాలకు పారదర్శకంగా ఎన్నికల నిర్వహిస్తామన్నారు. ఈ నెల 14 న ఉదయం. 10 గంటల నుంచి పోలింగ్ జరగుతుందన్నారు.