AP: నేడు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పోలవరంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తితో పాటు నదుల అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. పాలనలో చేసే మెరుగైన విధానాలను కలెక్టర్లు పలు చోట్ల అవలంబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.