14 ఏళ్ల యువకుడు డ్రగ్స్‌కు బానిసై మృతి చెందిన ఘటన యూపీలో జరిగింది. సప్నాసింగ్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కుమారుడైన సాగర్ గంగ్వార్ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల గంగ్వార్ అనుమానాస్పదంగా మరణించాడు.కుమారుడి మృతిపై సప్నాసింగ్ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన ఫ్రెండ్స్‌తో కలిసి గంగ్వార్ మద్యం, డ్రగ్స్ తీసుకున్నాడని, ఈ క్రమంలో డోస్ ఎక్కువ అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు.