గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉదయగిరి కొండ ప్రాంతంలో వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే భారీగా పర్యాటకులు వరద ప్రవాహాన్ని చూడడానికి దుర్గం పల్లె సమీపంలో ఉన్న ఉదయగిరి కొండకు పోటెత్తుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరి కొండ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పురాతన కాలంనాటి ఆలయాలు, అద్భుత జలపాతం, కోట గోడలు, వనమూలికలు కలిగిన మొక్కలు ఉన్నాయి. వర్షాలు పడితే పర్యాటకులు వెళతారు.