ఉదయగిరి పట్టణం, దుర్గం పల్లి వాసులకు నీరు అందించే కోన కాలువను పారిశుద్ధ్య కార్మికులు గురువారం శుభ్రం చేశారు. ఉదయగిరి కొండపై ఎన్నో మూలికలను తాకుతూ జాలువారే ఈ నీరు తాగితే రోగాలు దరిచేరవని చుట్టుపక్కల ప్రజల నమ్మకం. ఈ నీరు మొత్తం కోన నుంచి కింద తొట్టెకు చేరి అక్కడి నుంచి కాలువ ద్వారా గ్రామాలకు వెళ్తుంది. కొన్ని రోజులుగా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేశారు.