నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామస్తులు ఆదివారం గ్రామ దేవత పోలేరమ్మకు ఘనంగా పొంగళ్ళు పెట్టారు. ముందుగా మేల తాలాల మధ్య ఊరేగింపుగా మహిళలు పొంగళ్లను తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించి, నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు సకాలంలో పడి గ్రామం ససస్యమలంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.