ఉదయగిరి మేజర్ పంచాయతీలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ సామ్రాజ్యం అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వ్యయంపై చర్చించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పట్టణంలోని నీటి సమస్య గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముత్తూజ హుస్సేన్ పాల్గొన్నారు.